‘శ్రీమంతుడు’ ఫస్ట్ వీక్ ఓవర్సీస్ కలెక్షన్స్

‘శ్రీమంతుడు’ ఫస్ట్ వీక్ ఓవర్సీస్ కలెక్షన్స్

Published on Aug 14, 2015 6:02 PM IST

Srimanthudu
మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే! గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. మొదటివారం విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించిన ‘శ్రీమంతుడు’, అదే జోరుతో రెండో వారంలోకి నేటితో ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 65 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఓవర్సీస్‌లో కూడా అదే జోరు కొనసాగించింది.

ఇక మొదటివారం ముగిసేసరికి ఓవర్సీస్‌లో శ్రీమంతుడు సినిమా 14 కోట్ల 50 లక్షల షేర్ వసూలు చేసిందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ మొత్తంలో ఒక్క అమెరికా నుంచే 9 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ క్రేజ్, బలమైన కథ, కమర్షియల్ అంశాలతో సున్నితంగా చెప్పిన సోషల్ మెసేజ్ లాంటి అంశాలు శ్రీమంతుడు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు