చెన్నైలో రెండో వారం కూడా స్ట్రాంగ్‌గా ‘శ్రీమంతుడు’

చెన్నైలో రెండో వారం కూడా స్ట్రాంగ్‌గా ‘శ్రీమంతుడు’

Published on Aug 14, 2015 8:00 PM IST

srimanthudu
మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే! గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. మొదటివారం, విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించిన ‘శ్రీమంతుడు’, అదే జోరుతో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 65 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌‍తో పాటు చెన్నైలో కూడా అదే జోరు కొనసాగించింది. చెన్నైలో మొదటివారాంతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద టాప్ పొజిషన్‌లో నిలబడిన విషయం తెలిసిందే. ఇక రెండో వారం తమిళంలో రెండు పెద్ద సినిమాలు విడుదలైనా శ్రీమంతుడు స్క్రీన్ కౌంట్ పెద్దగా తగ్గలేదు. ఇక రెండో వారం మొదటిరోజైనా నేడు కూడా శ్రీమంతుడు థియేటర్లలో మంచి ఆక్యుపన్సీ కనిపించిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు