
ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది. అదే ఓ అప్ కమింగ్ హీరో సినిమా అయితే… బిజినెస్ అవ్వడానికి నానా తంటాలు పడాల్సిందే. కానీ, ‘అబ్బాయితో అమ్మాయి’ అనే చిత్రం విషయంలో ఇది రివర్శ్ లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఈలోపు నాలుగు జిల్లాల్లో బిజినెస్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాకి ఇలా జరగడం సంచలనమే. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరు అంటే.. ‘నాగశౌర్య’. హీరోయినేమో ముంబై భామ పాలక్ లల్వాని. దర్శకుడేమో రమేశ్ వర్మ. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎప్పుడు మొదలుపెట్టారో కానీ సైలెంట్ గా టాకీ పార్ట్ కూడా పూర్తి చేసేశారు. ఇక, పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. రేపు (15.08.) ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రం వైజాగ్ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ 63లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. కృష్ణ, గుంటూరు, వెస్ట్ ఏరియాల్లో కూడా బిజినెస్ పూర్తి కావడం విశేషం. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా పాటలు స్వరపరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకుంటున్నారు.
‘అబ్బాయితో అమ్మాయి’ బిజినెస్ అదిరిందట!
‘అబ్బాయితో అమ్మాయి’ బిజినెస్ అదిరిందట!
Published on Aug 14, 2015 11:20 AM IST
సంబంధిత సమాచారం
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- రవిబాబు షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీనే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని చంపేస్తుంది
- Emotional Video: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన దళపతి.. జీవాను ఓదారుస్తూ ఎమోషనల్ అయిన విజయ్
- SRH vs PBKS IPL 2026: క్లాసెన్ ఊచకోత, ఇషాన్ విధ్వంసం.. టేబుల్ టాపర్గా సన్రైజర్స్!
- ఇంటర్వ్యూ: లావణ్య త్రిపాఠి కొణిదెల – ‘సతీ లీలావతి’ ఎంతో రిఫ్రెషింగ్ గా ఫన్ గా ఉంటుంది
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!
- ‘స్పిరిట్’ వాయిదా పడిందా? సాలిడ్ క్లారిటీ బయటకి
- ‘పెద్ది’ కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో ‘రంగస్థలం’ని మించి
- సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. ధనుష్ క్రేజ్ తగ్గిందా..?
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!

