ఓవర్సీస్ లో రజినీ రికార్డ్ బ్రేక్ చేసిన ‘శ్రీమంతుడు’

ఓవర్సీస్ లో రజినీ రికార్డ్ బ్రేక్ చేసిన ‘శ్రీమంతుడు’

Published on Aug 16, 2015 9:55 AM IST

Srimanthudu
ఓ సూపర్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల దాహాన్ని తీర్చి, బాక్స్ ఆఫీసు వద్ద వారు కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘శ్రీమంతుడు’. ఆగష్టు 7న మహేష్ బాబు బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి 8 రోజుల్లో 100కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా క్రాస్ చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చి పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుకి స్ట్రాంగ్ బిజినెస్ బేస్ ఉన్న ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తోంది.

యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ వీకెండ్ లో శ్రీమంతుడు సినిమా $2మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి మహేష్ బాబు కెరీర్లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించడమే కాకుండా యుఎస్ బాక్స్ ఆఫీసు వద్ద టాలీవుడ్ సెకండ్ అత్యధిక గ్రాసర్ గా నిలిచింది. అంతటితో ఆగకుండా తాజాగా మరో రికార్డ్ ని బ్రేక్ చేసింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో ఆల్ టైం టాప్ 2 స్థానాల్లో బాహుబలి, ఎంథిరన్(తెలుగులో రోబో) ఉన్నాయి. కానీ 9వ రోజుతో శ్రీమంతుడు సినిమా ఓవర్సీస్ లో $2,429,412 గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి రజినీకాంత్ ఎంథిరన్ రికార్డ్ ని బ్రేక్ చేసేసి ఓవర్సీస్ లో సౌత్ ఇండియన్ ఆల్ టైం టాప్ గ్రాసర్స్ లిస్టు లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. శ్రీమంతుడు లాంగ్ రన్ లో 3 మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు