
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 9వ సినిమా విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా దసరా కానుకగా సినిమాన రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవల్ థాయ్ ల్యాండ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో బిజీబిజీగా గడిపిన రామ్ చరణ్ టీం ఇటీవలే హైదరాబాద్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ షెడ్యూల్ ని షురూ చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ మరియు కమెడియన్స్ పై సినిమాలోని ఫుల్ కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ కామెడీ సీన్స్ అందరినీ అమితంగా మెప్పిస్తాయని ఈ చిత్ర టీం చెబుతోంది. ఇప్పటి వరకూ ఎక్కువ కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేయని రామ్ చరణ్ చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు.
కామెడీకి యాక్షన్ ని మిక్స్ చేసి చెప్పడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన మార్క్ కామెడీ బాగా ఎక్కువగా ఉంటుందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ 60% పూర్తయ్యింది. హైదరాబాద్ లో జరుగుతున్నా ఈ షెడ్యూల్ తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం బ్యాంకాక్ వెళ్లనున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ముందు చెప్పిన అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఫైటర్, బ్రూస్ లీ, విజేత అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

