‘బాహుబలి’.. ఇప్పుడు ఇండియా నెంబర్ 1!

‘బాహుబలి’.. ఇప్పుడు ఇండియా నెంబర్ 1!

Published on Aug 17, 2015 5:03 PM IST

baahubali11
తెలుగు సినిమాను ఒక ప్రాంతీయ భాషా సినిమా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా ‘బాహుబలి’. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, విడుదలైన అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్‌లో ఒక డబ్బింగ్ సినిమా ఉనికి కూడా పెద్ద విషయమైన పరిస్థితుల్లో కూడా అక్కడా బాహుబలి ప్రభంజనం సృష్టించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 570 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా పీకే, భజరంగీ భాయ్‌జాన్ తరువాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక హిందీ సినిమా మార్కెట్ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ సాధించడం పలు హాలీవుడ్ మ్యాగజైన్‌లను సైతం ఆశ్చర్యపరచింది. బాహుబలి బాక్సాఫీ ప్రభంజనాన్ని ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా కొనియాడింది. ఒక ప్రాంతీయ భాషా సినిమా ఇండియన్ సినిమాకు కొత్త అడ్రస్‌ను చూపడంలో సఫలమవ్వడం విశేషంగా కనిపిస్తోన్న అంశమని పలు హాలీవుడ్ పత్రికలు బాహుబలిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద బాహుబలి మూడో స్థానంలో నిలిచినా, ఇండియన్ మార్కెట్లో మాత్రం పీకే, భజరంగీ భాయ్‌జాన్ సినిమాలను పక్కన పెట్టి టాప్‌లో నిలవడం ఆసక్తికర అంశం. ఇండియన్ మార్కెట్లో బాహుబలి 500 కోట్లు కలెక్ట్ చేయగా, పీకే, భజరంగీ సినిమాలు 450 కోట్ల దగ్గరే ఆగిపోయాయ్! ఓవర్సీస్‌లో హిందీ సినిమాకున్న మార్కెట్ కారణంగా పీకే, భజరంగీ భాయ్‌జాన్‌లు ఆ స్థాయి కలెక్షన్లను సాధించాయి. ఇక కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే ఉందనుకున్న ఒక సినిమా ఇలా బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానంలో నిలబడటం విశేషమే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు