
ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమా సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కంటెంట్ ఉన్న పాయింట్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజంట్ చెయ్యడానికి చాలా తక్కువ మంది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే అది రిస్క్ తో కూడుకున్న పని, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాంటి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ని ట్రై చెయ్యడమే కాకుండా సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు. ఆ సినిమానే ‘శ్రీమంతుడు’. కొరటాల శివ దర్శకుడిగా ఓ సరికొత్త మహేష్ బాబుని ప్రేక్షకులకు చూపించడమే కాకుండా తను అనుకున్న పాయింట్ ని కూడా ఆడియన్స్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేసాడు. ఈ సినిమా విడుదలిన మొదటి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టిస్తోంది.
ఇప్పటి వరకూ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ టాలీవుడ్, ఓవర్సీస్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీసు పరంగా రికార్డ్స్ సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో న్యూ ఘనతని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకూ నార్త్ అమెరికాలోని అర్జెంటీనాలో ఒక్క తెలుగు సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ 10 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని అర్జెంటీనా రాజధాని అయిన బ్యూనోస్ ఐరిస్ లో శ్రీమంతుడు స్పెషల్ షో వేశారు. ఈ షోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతే కాకుండా వచ్చే వారం నార్త్ అమెరికాలోని చిలీలో కూడా శ్రీమంతుడుని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమాకి దక్కని అరుదైన రికార్డ్ శ్రీమంతుడుకి దక్కింది. శ్రీమంతుడు సినిమా తెలుగు ప్రేక్షకులను, సినీ వర్గాలను, విమర్శకులను మాత్రమే కాదు ఫేమస్ పొలిటీషియన్స్ కూడా ఈ సినిమాని చూసి ప్రశంశిస్తున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

