కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా వాళ్ళే నిర్మాతలు.?

కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా వాళ్ళే నిర్మాతలు.?

Published on Aug 18, 2015 4:46 PM IST

koratala-shiva
రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా మిర్చి’, ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్. ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా ఎంచుకొని శ్రీమంతుడు అనే సినిమాని తీసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. కొరటాల శివ రెండవ సినిమాతో ద్వితీయ విజ్ఞాన్ని కూడా చాలా ఈజీగా దాటేసి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు కొరటాల శివ. ప్రసతుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ అండ్ శ్రీమంతుడు టీం సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు అందరి చూపు కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అనేదాని మీదే ఉంది. శ్రీమంతుడు సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయం అయిన నిర్మాతలు నవీన్,రవి శంకర్, మోహన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు తమ రెండవ సినిమాని కూడా కొరటాల శివ డైరెక్షన్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ భాగం ఎన్.టి.ఆర్ హీరోగా నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు. అన్నీ ఓకే అయితే డిసెంబర్ నుంచి కొరటాల శివ – మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు