
సురేందర్ రెడ్డి.. అతి కొద్దికాలంలోనే సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనదంటూ ఒక మార్క్ సెట్చేసిన దర్శకుడు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవి తేజ ఇలా టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ దర్శకుడి తాజా చిత్రమే ‘కిక్ 2’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే 2009లో వచ్చిన సూపర్ హిట్ ‘కిక్’ సినిమాకు రీమేక్‌గా ‘కిక్ 2’ రూపొందింది. ‘రేసుగుర్రం’ లాంటి బంపర్ హిట్ కొట్టిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడం, కిక్ సినిమాకు మొదట్నుంచీ ఉన్న క్రేజ్, రవితేజ స్టార్డమ్, నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్.. ఇవన్నీ కలిపి ‘కిక్ 2’ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశాయి.
ఇక ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరికి ఈ వారానికి షిఫ్ట్ అయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సినిమా యూనిట్ కూడా ‘కిక్ 2’ తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ‘కిక్ 2’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా గురించి తెలియజేస్తూ.. కిక్ కంటే దబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుందని, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉండనుందని సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రవి తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చారు.

