
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, రీసెంట్‌గా వచ్చిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాతో అటూ విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ విజయాన్నీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో, ‘భలే మంచి రోజు’ అనే సినిమాను అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు.
కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకుంది. తాజాగా ఓ ఎంటర్‌టైనింగ్ క్లైమాక్స్‌ను పూర్తి చేశారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చిత్ర యూనిట్ ఉంది. ఉయ్యాల జంపాల ఫేం ఎం.ఆర్.సన్నీ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా తనకు మరో హిట్ తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నారు.

