గోపీచంద్ కొత్త సినిమా సగం పూర్తైంది..!

గోపీచంద్ కొత్త సినిమా సగం పూర్తైంది..!

Published on Aug 22, 2015 7:23 PM IST

Gopichand
‘సాహసం’, లౌక్యం, జిల్.. ఈ మధ్యకాలంలో ఇలా వరుస సినిమాలతో మెప్పిస్తూ వచ్చిన గోపీచంద్, దర్శకుడు ఏ.ఎస్.రవి కుమార్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో మొదలుకాగా, అప్పుడే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. గోపీచంద్‌కు ‘యజ్ఞం’ లాంటి బంపర్ హిట్ సినిమానిచ్చిన ఏ.ఎస్.రవి కుమార్, మళ్ళీ పదేళ్ళకు ఆయనతో సినిమా చేస్తున్నారు.

ఇప్పటివరకూ జరిగిన షెడ్యూల్‌లో ఫస్ట్‌హాఫ్ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తైందని దర్శకుడు తెలిపారు. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, ఫస్టాఫ్ చూశాక కొత్త ఎనర్జీతో రెండో భాగంపై కృషి చేస్తున్నామని సినిమా యూనిట్ చెబుతోంది. గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా, గోపీచంద్‌కు యజ్ఞం కంటే పెద్ద హిట్ తెచ్చిపెడుతుందని దర్శకుడు రవి కుమార్ నమ్మకంగా చెబుతున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు