వాయిదా పడనున్న అనుష్క ‘రుద్రమదేవి’.!

వాయిదా పడనున్న అనుష్క ‘రుద్రమదేవి’.!

Published on Aug 23, 2015 5:15 PM IST

Rudhramadevi

టాలీవుడ్ లో ‘బాహుబలి’ లాంటి సూపర్ హిట్ భారీ బడ్జెట్ పీరియాడికల్ సినిమా తర్వాత రానున్న మరో హిస్టారికల్ పీరియడ్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. కాకతీయ వీరనారిరుద్రమదేవి జీవిత కథ ఆధారంగా చేసుకొని భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తీసాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న యోగ బ్యూటీ అనుష్క రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని, ఈ సారి ఎలాంటి ఎలాంటి సమస్యా లేకుండా సెప్టెంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నామని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది.

అందులో భాగంగానే ఇటీవల ఈ టీం ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టింది. కానీ తాజాగా విశ్వసనీయ వర్గాలనుంచి అందిన సమాచారం ప్రకారం రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4నుంచి వాయిదా పడనుంది. 2డి వర్క్స్ అన్నీ పూర్తయినా 3డి సినిమా వర్క్స్ ఇంకా పూర్తవలేదు. దానికోసం మరికొంత టైం పట్టే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ 4 నుంచి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారని సమాచారం. రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు