హరీష్ తీసిన గబ్బర్ సింగ్ అంటే చాలా ఇష్టం – చిరు

హరీష్ తీసిన గబ్బర్ సింగ్ అంటే చాలా ఇష్టం – చిరు

Published on Aug 24, 2015 8:33 AM IST

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మేనల్లుడుగా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి చేసిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర రెండవ సారి జోడీ కట్టిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసాడు.

ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ ‘ హరీష్ శంకర్ తమ్ముడు పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాలోని నటుడు బయటకి వచ్చి ఇలాంటి సినిమా కదా, ఇలాంటి దర్శకుడు కదా నాకు కావాల్సిందనిపించింది. ఇక అన్ని శాఖలపై పట్టున్న దిల్ రాజు ఎప్పుడూ నాకు అవకాశం ఇవ్వండి సార్ మీతో ఓ సినిమా చేయాలని ఉంది అని అడుగుతుంటాడు నిజానికి నేనే ఆయన్ని నాతో ఓ సినిమా చేయండి అని అడుగుదాం అనుకున్నానని’ తెలిపాడు. అలాగే సినిమాలో సాయి, రెజీనలు బాగా చేసారని చిరు తెలిపారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మూవీలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆడియో లాంచ్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కి వస్తున్న సూపర్బ్ రెస్పాన్స్ తో సినిమాపై హైప్ పెరిగింది. పూర్తి కమర్షియల్ హంగులతో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు