మెగా ఫ్యామిలీ కి పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూనే ఉన్నాయి. చిరు మరియు పవన్ ఎన్ని సార్లు ఈ వార్తలని ఖండించినా మళ్ళీ మళ్ళీ పుకార్లు పుడుతూనే ఉన్నాయి. తాజాగా అభిమానులు చేసిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో నాగబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ అలాంటి వార్తలకి ఆజ్యం పోసింది. కానీ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ చిరు 60వ బర్త్ డే బాష్ కి హాజరయ్యాడు. అంతే కాకుండా ఆయన ఈ వేడుకలో పవన్ తన అమ్మ నాన్నలలా భావించే అన్నయ్య చిరంజీవి, వదినమ్మ సురేఖ గారితో కాసేపు ఆనందంగా గడిపారు. ఈ ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. అవి మెగా అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తాయి. చాలా రోజుల తర్వాత చిరంజేవి – పవన్ కళ్యాణ్ లను కలిసి చూడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆ హ్యాపీ మోమెంట్ కి సంబందించిన ఫోటోలు మీకందిస్తున్నాం చూసి ఎంజాయ్ చెయ్యండి. అలాగే ఈ లవ్లీ మోమెంట్ పై మీ కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
- “పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం!
- “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా?
- “పుష్ప 2” కోసం ఫాహద్ ఫాసిల్ ఇన్ని రోజుల కేటాయింపు!?
- వీడియో : డబుల్ ఇస్మార్ట్ టీజర్ (రామ్ పోతినేని)
- థియేటర్ల లోకి “ఇండియన్ 2” వచ్చేది అప్పుడే?
- ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !
- డబ్బింగ్ చెప్పిన దీపికా పదుకొణె ?