
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు సూపర్ ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న ఈ హీరో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. ఇక సెట్స్‌పై ఉన్నప్పటి నుంచే పాజిటివ్ వైబ్రేషన్‌తో కనిపించిన ఈ సినిమా ఆడియోతో మరింత ఆసక్తి కలిగిస్తోంది.
నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ముఖ్యంగా హరీష్ శంకర్ స్టైల్ డైలాగ్స్, వాటిని సాయిధరమ్ తేజ్ తనదైన స్టైల్లో చెప్పిన విధానం ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ట్రైలర్ మొత్తం విజువల్స్ పరంగా కలర్ఫుల్గా ఉంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలోనే గతంలో వచ్చిన ‘మిరపకాయ్’ సినిమా ఫ్లేవర్ ఈ ట్రైలర్లో కనిపిస్తూ బాగా ఆకట్టుకుంటోంది. రెజీనా, అదా శర్మల గ్లామర్ కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ఆశించవచ్చు. హరీష్ శంకర్ సినిమా అంటే ఒక మేజర్ పాయింట్, దానిచుట్టూ కొన్ని సబ్‌ప్లాట్స్, ఈ సబ్‌ప్లాట్స్ ద్వారానే యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ లాంటివి చూస్తూంటాం. ఈ సినిమా కూడా ఆ స్టైల్లోనే కనిపిస్తూ ఆసక్తి కలిగిస్తోంది. సినిమా అన్ని కమర్షియల్ అంశాలను కలగలిపి ఉందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక హరీష్ శంకర్ పంచ్ డైలాగ్స్ థియేటర్లలో అందరినీ కట్టిపడేసే అంశంగా కనిపిస్తోంది. చివర్లో “నేను మాటల్తో మాయ చేయగలను, సంచీల కొద్ది పంచ్లేయగలను. కానీ నా టార్గెట్ పంచేయడం కాదు, పన్జేయడం” ట్రైలర్‌కి హైలైట్!
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

