మునిచ్ నుంచి స్పెయిన్ కి షిఫ్ట్ అయిన ‘అఖిల్’

మునిచ్ నుంచి స్పెయిన్ కి షిఫ్ట్ అయిన ‘అఖిల్’

Published on Sep 7, 2015 7:58 PM IST

akhil
లెజండ్రీ యాక్టర్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడవతరం యంగ్ హీరో అఖిల్ అక్కినేని. వివి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ చేస్తున్న మొదటి సినిమా ‘అఖిల్’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం సినిమాలో మిగిలి ఉన్న మూడు పాటల షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా రెండు పాటలను షూట్ చెయ్యడం కోసం యూరప్ వెళ్ళారు. సెప్టెంబర్ 2 నుంచి మునిచ్ లో అఖిల్ – సయేషా సైగల్ పై వచ్చే ఓ మెలోడీ సాంగ్ ని షూట్ చేసారు. 4 రోజుల్లో ఫస్ట్ సాంగ్ షూటింగ్ ని ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం సెకండ్ సాంగ్ కోసం మునిచ్ నుండి స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యారు.

నేటి నుంచి స్పెయిన్ లో అఖిల్ – సయేషా సైగల్ లపై మరో డ్యూయెట్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకి రఘు మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ నెల 12 వరకూ అక్కడే ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వస్తారు. యూరప్ లో షూట్ చేసిన ఈ రెండు సాంగ్స్ ఆన్ స్క్రీన్ చాలా గ్రాండ్ గా ఉంటాయని సమాచారం. ఇండియాకి తరిగి వచ్చాక సినిమాలో బాలన్స్ ఉన్న ఐటమ్ సాంగ్ ని హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మెలోడీ టచ్ – మాస్ బీట్ ఏదీ మిస్ కాకూడదని అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ లు కంపోజ్ చేసిన అఖిల్ ఆడియో ని స్పెతెమ్బార్ 20న రిలీజ్ చేయనున్నారు. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు