బన్ని సేఫ్ గానే ఉన్నాడు – అల్లు అరవింద్

బన్ని సేఫ్ గానే ఉన్నాడు – అల్లు అరవింద్

Published on Sep 8, 2015 1:21 PM IST

alllu-arjuna-and-arvind
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పై యాక్షన్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. కానీ తాజాగా అల్లు అర్జున్ ని హాస్పిటల్ లో చూసిన కొందరు అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్ లో గాయ పడ్డాడనే వార్తలు మీడియాలో రావడం మొదలు పెట్టాయి. కానీ ఆ వార్తల్లో అసలు నిజం లేదని అల్లు అరవింద్ తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ రోజు బన్ని సతీమణి స్నేహలతా రెడ్డికి ఓ చిన్న మైనర్ సర్జరీ ఉంది. అందుకోసమే ఈ రోజు ఉదయం స్నేహతో కలిసి అల్లు అర్జున్ హాస్పిటల్ కి వెళ్ళాడు. ఆ తర్వాత అటు నుంచి షూటింగ్ లొకేషన్ కి వెళ్ళిపోయాడు. స్నేహకి చేస్తున్న సర్జరీ చాలా చిన్నది సాయంత్రం కల్లా తను ఇంటికి వచ్చేస్తుందని’ తెలిపాడు. దీంతో అభిమానులు ఆ యాక్సిడెంట్ టెన్షన్ నుంచి బయటపడ్డారు. అల్లు అర్జున్ – బోయపాటి కాంబినేషన్ లో సెట్స్ పై ఉన్న సినిమాని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు