
వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో రూపొందిన సినిమా అంటేనే ఆ సినిమాపై ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌తోనే సెప్టెంబర్ 17న వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు. తమిళంలో జై హీరోగా నటించారు. గతంలో గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రేమ్ సాయి ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి విడుదలకు సిద్ధమైంది. ఈ మధ్యే విడుదలైన కొరియర్ బాయ్ కళ్యాణ్ ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా గత కొద్దిసేపటి క్రితం గౌతమ్ మీనన్, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కొత్త ట్రైలర్‌ను లాంచ్ చేశారు. గతంలో విడుదలైన ట్రైలర్ కన్నా, ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా సరికొత్తగా కనిపిస్తూ మెప్పిస్తోంది.
“లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా ఉండాలనుకునే మామూలు వ్యక్తి ఇతను. అలాంటి వాడికి ఓ ప్రాబ్లమ్. అది తనకు ఎదురురాలేదు. అతడే ప్రాబ్లమ్‌కి ఎదురెళ్ళాడు” అంటూ గౌతమ్ మీనన్ వాయిస్ ఓవర్లో మొదలైన ఈ ట్రైలర్ “ఒక మామూలు మనిషిని అసాధారణమైన మనిషిగా మార్చటానికి ఒక్క సంఘటన చాలు” అంటూ ముగుస్తూ ఆసక్తికరంగా నడిచింది. ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తి కలిగించే విషయంలో దర్శక నిర్మాతలు బాగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

