
ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి'(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – తమిళ యంగ్ హీరో కార్తీ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా కనిపించనుంటే, సెకండ్ హీరోయిన్ గా గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ కనిపించనుంది. వీరిద్దరితో పాటు యోగ బ్యూటీ అనుష్క కూడా ఓ ముఖ్యమైన అతిధి పాత్రలో మెరవనుందని ఇదివరకే తెలియజేశాం. తాజాగా అనుష్క పాత్ర గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.
ఈ చిత్ర టీం నుంచి మేము సేకరించిన సమాచారం ప్రకారం ఊపిరి సినిమాలో నాగార్జున మాజీ లవర్(ఎక్స్ గర్ల్ ఫ్రెండ్)గా అనుష్క కనిపించనుంది. ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన అనుష్క సడన్ గా నాగార్జున జీవితంలోకి రావడంతో కథ మలుపు తిరుగుతుందని సమాచారం. తను కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాకి కీలకమైన పాత్ర అని టీం అంటోంది. నేటి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్న అనుష్క మూడు రోజులు ఈ సినిమా కోసం కేటాయించింది. ఇప్పటికే 80% పైన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.

