
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా తెరపై కనిపించే హీరో, హీరోయిన్స్ కి మాత్రమే ఎక్కువ గుర్తింపు, స్టార్డం వస్తుంది. సినిమాకి కెప్టెన్ గా నిలిచే దర్శకులలో కొంతమందికి మాత్రమే స్టార్స్ రేంజ్ ఇమేజ్ వస్తుంది. అలాగే 2000 – 2005 టైములో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేసి తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తేజ. కాస్త గ్యాప్ తర్వాత తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని తేజ చేసిన ‘హోరా హోరీ’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ద్వారా దిలీప్ – దక్షలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేసారు.
తేజ ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకూ మీరు అన్ని డిపార్ట్ మెంట్స్ తో కలుపుకొని సుమారు 1000మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఒకరిని చూడగానే హీరో అవుతాడు అని ఎలా నిర్ణయిస్తారు అని అడిగితే ‘నేను చాలా రియలిస్టిక్ గా ఉంటాను. దానికి తగ్గట్టే నా కథలు ఉంటాయి. నేను ఒకరిని చూసినప్పుడు అతని కళ్ళలో నేను అనుకున్న దానికి సరిపోయే కంటెంట్ ఉందా లేదని చూసి సెలక్ట్ చేస్తాను, లుక్, గ్లామర్ తర్వాత చూస్తాను. నేను జ్యోతిష్యున్ని కాదు కానీ ఒకరిని చూడగానే పనికొస్తాడా లేడా అని చెప్పగలను. చెప్పాలంటే నువ్వు నేను టైంలో బన్నిని ఐర్ల్ పోర్ట్ లో చూసి తను హీరోగా బాగా సెట్ అవుతాడని హీరో చెయ్యమని అరవింద్ గారికి చెప్పాను. కానీ తను 3డి డిజైనింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడని, హీరో అయ్యే ఉద్దేశం లేదని చెప్పారు. కానీ నేను హీరోనే చెయ్యమన్నా.. అప్పుడు నో అనుకున్నా ఇప్పుడు బన్ని ఫైనల్ గా హీరోనే అయ్యాడని’ తేజ చెప్పాడు.

