డ్యాన్స్‌తో అదరగొట్టేందుకు సిద్ధమైన ‘అఖిల్’..!

డ్యాన్స్‌తో అదరగొట్టేందుకు సిద్ధమైన ‘అఖిల్’..!

Published on Sep 10, 2015 9:29 PM IST

akhil
‘అఖిల్’.. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో పాపులర్ అయిపోయిన పేరు. అక్కినేని తరం నుంచి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అక్కినేని అఖిల్, తన మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ అనే పెట్టి రంగంలోకి దిగుతున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఒకటి రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 20న పెద్ద ఎత్తున జరగనుంది.

ఇక ఇదిలా ఉంటే.. తన మొదటి సినిమా ద్వారానే అఖిల్, స్టార్‌డమ్ దిశగా దూసుకెళ్ళే సూచనలు స్పష్టంగా కనిపిస్తూన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. డ్యాన్స్, ఫైట్స్‌ విషయంలో అఖిల్ అందరినీ ఆకట్టుకుంటాడని, తనదైన డ్యాన్స్ స్టైల్‌తో కట్టిపడేస్తాడంటూ నాగార్జున చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని మేకింగ్ వీడియాల్లో అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ ఎలా ఉండనున్నాయనేది పరిచయం చేశారు. దీంతో సినిమాలో ఈ సన్నివేశాలు ఇంకా కిక్ ఇస్తాయని అభిమానులు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. హీరో నితిన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు