‘బ్రహ్మోత్సవం’ నుంచి తప్పుకున్న సునీల్

‘బ్రహ్మోత్సవం’ నుంచి తప్పుకున్న సునీల్

Published on Sep 11, 2015 8:32 AM IST

sunil
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ టాప్ సెకండ్ గ్రాసర్ గా కూడా నిలిచింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు. బ్రహ్మోత్సవం షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. అలాగే సెప్టెంబర్ 16 నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి టాప్ కమెడియన్, ఇప్పటి హీరో సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనలే ఉద్దేశంతో మేము సునీల్ సన్నిహితులను అప్రోచ్ అయితే వారు సునీల్ బ్రహ్మోత్సవం సినిమాలో ఎలాంటి రూల్ చేయడం లేదని, ఈ చిత్ర టీం అనుకున్నా, కొన్ని కారణాలవల్ల సునీల్ కి కుదరకపోవడంతో బ్రహ్మోత్సవంలో నటించడం లేదని తెలిపారు. దీంతో ఈ వార్తలకు తెరపడింది. సెప్టెంబర్ 16 నుంచి కంటిన్యూగా షూటింగ్ చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు