‘బిందాస్ 2’కి సిద్దం అంటున్న మనోజ్-వీరూ పోట్ల

‘బిందాస్ 2’కి సిద్దం అంటున్న మనోజ్-వీరూ పోట్ల

Published on Sep 11, 2015 8:11 PM IST

Manchu-Manoj
మంచు వారబ్బాయి మంచు మనోజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మొదటగా చెప్పుకునే సినిమా ‘బిందాస్’. 2010లో వచ్చిన ఈ సినిమాకి వీరూపోట్ల డైరెక్టర్. ఆ ఏడాది తక్కువ బడ్జెట్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు. అప్పట్లో మనోజ్ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ప్లాన్ లో వీరూపోట్ల మనోజ్ ఉన్నారు. అనిల్ సుంకర కూడా ఆ విషయంలో సముఖంగానే ఉన్నాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం వీరూపోట్ల – మంచు మనోజ్ లు ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉన్నారు. దానికి తగ్గా స్టొరీ లైన్ ని ఇప్పటికే వీరూపోట్ల రెడీ చేసాడట. కానీ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అటు మనోజ్ – ఇటు వీరూపోట్లకి సినిమా సీక్వెల్ పై ఆసక్తిగా ఉండడంతో త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని వీరి సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం మనోజ్ దశరథ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా తర్వాత మనోజ్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు సో ఈ సినిమా అయ్యేలోపు బిందాస్ 2 గురించి డెసిషన్ తీసుకుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు