టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’..!

టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’..!

Published on Sep 12, 2015 9:51 AM IST

baahubali

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు ‘ఇంటర్నేషనల్ కట్’తో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చే క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఉన్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’కి ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించే ఆలోచన చేశారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను ఎడిట్ చేయించారు. ఇక ఈ ఇంటర్నేషనల్ వర్షన్ వచ్చే నెలలో భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుండగా, అంతకంటే ముందే ప్రస్తుతం టొరొంటోలో ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రైవైట్ స్క్రీనింగ్‌లో ప్రదర్శితం కానుంది. ఇందుకోసం నిర్మాతలు ఇప్పటికే టొరొంటో చేరుకున్నారు. ఇక ఇప్పటికే ప్రభంజనాల మోత మోగించిన బాహుబలి ఇంటర్నేషనల్ రిలీజ్‌లో ఏ రేంజ్ ప్రతిభ చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు