రిలీజ్‌కు సిద్ధమైన ‘భల్లాల దేవ’

రిలీజ్‌కు సిద్ధమైన ‘భల్లాల దేవ’

Published on Sep 12, 2015 9:00 AM IST

ballala-deva

విమల్ ,బిందు మాధవి హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొంది మంచి విజయం సాధించిన సినిమా ‘డేసింగు రాజా’. ఎళిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బాహుబలి సినిమాతో పాపులర్ అయిన ‘భల్లాలదేవ’ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై రావిపాటి సత్యనారాయణ ‘భల్లాల దేవ’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేస్తూ.. పూర్తి కామెడీ సినిమాగా రూపొందిన ‘భల్లాల దేవ’ ప్రతీ ఒక్కరినీ అలరించేలా ఉంటుందని, ‘భల్లాల దేవ’గా విమల్, కట్టప్పగా సింగం పులి నటన ఈ సినిమా హైలైట్ అవుతుందని నిర్మాత తెలిపారు. ఇమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోకు తెలుగు సాహిత్యం వనమాలి అందించారని, ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయని తెలియజేస్తూ, సెప్టెంబర్ 24న సినిమాను అన్నిచోట్లా విడుదల చేయనున్నామని నిర్మాతగా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు