
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున – కార్తీల కలయికలో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఒక ముఖ్య పాత్రలో అనుష్క మెరవనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ని ఈ నెల 18న ప్రకటించనున్నారు. అదేరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలచేయనున్నారు. ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత కట్టడం ఐఫిల్ టవర్ తో సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో ఒక పోస్టర్ విడుదలచేసారు.
ఈ సినిమాను పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. జాతీయ అవార్డు గ్రహిత గోపీ సుందర్ సంగీతదర్శకుడు.

