రిలీజ్‌కు రెడీ అయిన ‘చీకటి రాజ్యం’ ట్రైలర్

రిలీజ్‌కు రెడీ అయిన ‘చీకటి రాజ్యం’ ట్రైలర్

Published on Sep 16, 2015 10:23 AM IST

Kamal-Cheekati-Rajyam
‘చీకటి రాజ్యం’.. ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన ప్రయోగాత్మక సినిమా. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న చీకటి రాజ్యం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సాయంత్రం చెన్నైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4:21కి ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ సినిమాకు దర్శకుడు. త్రిష, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు విడుదల కానున్న ట్రైలర్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. కమల్ హాసన్ యూట్యూబ్‌లో చానల్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని, ట్రైలర్‌ను చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు