
‘ప్రేమమ్’.. సమ్మర్ కానుకగా విడుదలైన ఈ మళయాల సినిమా కేరళలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మళయాల సినీ పరిశ్రమ రికార్డులన్నింటినీ తిరగరాసిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నాగచైతన్య సిద్ధమైన విషయం తెలిసిందే. తెలుగులో చాలామంది యువహీరోలు ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించగా, చివరకు నాగచైతన్య ప్రేమమ్ తెలుగు రీమేక్‌కు పచ్చ జెండా ఊపారు. ‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి ప్రేమమ్ తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక బ్లాక్‌బస్టర్ ప్రేమమ్ సినిమాకు రీమేక్ అనగానే కనిపించే క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఇప్పటికే ప్రేమమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, అమైరా దస్తూర్‌లను ఇద్దరు హీరోయిన్లుగా ఎంపిక చేశారు. మెయిన్ లీడ్‌గా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ‘మజ్ను’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేశారు. ఓ లవ్ జర్నీ నేపథ్యంలో నడిచే కథకు ఈ టైటిల్ అయితే బాగుంటుందన్న ఆలోచనలో మజ్నూ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హరిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య గౌతమ్ మీనన్‌తో చేస్తోన్న సాహసం శ్వాసగా సాగిపో పూర్తి కాగానే ప్రేమమ్ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

