‘శంకరాభరణం’.. హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ హీరోగా, ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన సినిమా. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాకు భారీ అంచనాలను తెచ్చిపెట్టగా ఈ సినిమాకు పలువురు టాప్ హీరోలు ప్రచారం కల్పించడం మరింత హైప్ తెచ్చిపెట్టింది.
మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీజర్‍ను లాంచ్ చేసి ‘శంకరాభరణం’ టీమ్‌కు విషెస్ చెప్పగా, ఆ తర్వాత రానా కూడా ఓ సాంగ్‌ను లాంచ్ చేసి సినిమాకు ప్రచారం కల్పించారు. తాజాగా ఈ క్రమంలో లవర్ బాయ్ నాగ చైతన్య శంకరాభరణం సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆడియోలో లేని ఈ సాంగ్‌ను నాగచైతన్య ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌లో శంకరాభరణం టీమ్ కోరిక మేరకు విడుదల చేశారు. సినిమాలో పతాక సన్నివేశాల సమయంలో ఈ పాట వస్తుందని కోన వెంకట్ తెలుపుతూ, సాంగ్‌ను లాంచ్ చేసిన నాగ చైతన్య ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందిన ‘శంకరాభరణం’ సినిమా డిసెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదల కానుంది.
థీమ్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


