‘కుమారి 21F’ యూఎస్ కలెక్షన్స్

‘కుమారి 21F’ యూఎస్ కలెక్షన్స్

Published on Nov 22, 2015 6:42 PM IST

Kumari21f
విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ‘కుమారి 21F’. వరుస హిట్స్‌తో జోరుమీదున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప దర్శకత్వం వహించారు. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ కథ, కథనాలను అందించడం ఈ సినిమాకు మొదట్నుంచీ హైలైట్‌గా కనిపిస్తూ వచ్చింది.

ఇక భారీ క్రేజ్‌తో విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ చేత సూపర్ అనిపించుకొని బాక్సాఫీస్ వద్ద హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి రెండు రోజులు ఈ సినిమాకు ఏపీ, తెలంగాణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక అమెరికాలో గురువారం ప్రీమియర్స్, శుక్రవారం కలుపుకొని ఈ సినిమా 81,595డాలర్లు వసూలు చేసింది. సుకుమార్ పేరు అమెరికాలో ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. ఇక వీకెండ్స్‌లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక బోల్డ్ కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న సుకుమార్ ప్రయత్నానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు