రెండో వారమూ స్టడీగా దూసుకెళ్తోన్న ‘కుమారి’!

రెండో వారమూ స్టడీగా దూసుకెళ్తోన్న ‘కుమారి’!

Published on Dec 1, 2015 5:45 PM IST

Kumari21f
మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే! ఆ కోవలోనే సుకుమార్ తన సొంత బ్యానర్‌ సుకుమార్ రైటింగ్స్‌పై మొదటి సినిమాగా ‘కుమారి 21F’ను రూపొందించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 20న పెద్ద ఎత్తున విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతూ రాజ్ తరుణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ దిశగా దూసుకెళుతోంది.

‘కుమారి 21F’ సినిమాలో సుకుమార్ చెప్పిన బోల్డ్ కథాంశానికి యూత్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో వారాంతం కూడా మంచి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా సోమవారం కూడా ఎక్కడా డ్రాప్ కాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. యూత్ ఆడియన్స్ రిపీటెడ్‌గా కుమారిని చూసేందుకు థియేటర్లకు రావడం ఈ సినిమాకు బాగా కలిసి వస్తోంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ హీరోగా స్టార్‌డమ్ సంపాదించగా, సుకుమార్ తన మొదటి సినిమాకే నిర్మాతగా మంచి విజయం అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు