చెన్నై బాధితులకు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ల సహాయం

చెన్నై బాధితులకు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ల సహాయం

Published on Dec 2, 2015 4:34 PM IST

ntr-kalyan-ram
గత మూడు వారాలుగా చెన్నై మరియు ఆంధ్రలోని నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధానిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాలు, మెయిన్ ఏరియాలు, ఎయిర్ పోర్ట్ మొదలైన అన్ని ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. ప్రస్తుతం ఇతర రాష్టాల వారు, సెలబ్రిటీస్ అక్కడ ఇబ్బందులు పడుతున్న తమిళ ప్రజలకు తమ వంతు సాయం అందించడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు బృందాలు చెన్నై చేరుకొని అక్కడి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఈ చెన్నై భారీ వర్షాల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై పలువురు సెలబ్రిటీస్ స్పందిచడమే కాకుండా వారివంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘ఎప్పుడైతే ప్రకృతి ఇలా విజ్రుంభించి మన సమగ్రతను టెస్ట్ చేస్తుందో అప్పుడే మనమంతా ఒకరికి సహాయం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ చెన్నై బాధితులకు సహాయం అందించాలని, అలాగే నేను కూడా నా వంతు సహాయం అందిస్తానని’ తారక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అలా పిలుపునిచ్చిన కొద్ది సేపటికే ఎన్.టి.ఆర్ 10 లక్షల రూపాయల్ని సహాయంగా తమిళనాడుకు అందించాడు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా తన వంతుగా 5 లక్షల రూపాయల్ని చెన్నై సహాయ నిధికి డొనేట్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు