పండుగ కి విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా..?

పండుగ కి విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా..?

Published on Jun 6, 2016 10:39 AM IST

Pawan-Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యస్. జె. సూర్య సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి కథ, మాటలు ఆకుల శివ సమకూర్చగా ‘బిల్లా’ ఫేం సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మొదటి షెడ్యూల్‍ను తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుండగా తర్వాత ఎక్కువ శాతం ముంబై లో షూటింగ్ జరుపుకోనుంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయదశమి కానుకగా సినిమాని విడుదల చేస్తారని తెలిసింది. కుదరకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాత, పవన్ స్నేహితుడు అయిన శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు