గోవా సుందరి ఇలియానాకి 2011 సంవత్సరం పెద్దగా అవకాశాలు లేకపోవడం, చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఆమె ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు మరియు, అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ‘జులాయి’ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఈ రెండు చిత్రాల దర్శకులు గతంలో ఇలియానాతో సూపర్ హిట్ సినిమాలు తీసారు. దేవుడు చేసిన మనసులు దర్శకుడు పూరి జగన్నాధ్ ఇలియానాతో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసారు. జులాయి చిత్ర దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమెతో జల్సా వంటి కమర్షియల్ హిట్ తీసి చూపించారు. దేవుడు చేసిన మనుషులు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా జులాయి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని జూన్లో విడుదలకు సిద్ధమవుతుంది. వీరిద్దరూ కలిసి ఇలియానాకు పూర్వ వైభవం తెస్తారో లేదో వేచి చూద్దాం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బ్రేకింగ్: అవైటెడ్ “కల్కి” ట్రైలర్ డేట్ వచ్చేసింది.!
- లేటెస్ట్…ఐ మ్యాక్స్ స్క్రీన్స్ లో ప్రభాస్ “కల్కి”
- “దేవర” ఎలా ఉండబోతుందో.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్
- వైరల్: అశ్వనీదత్ ప్రిడిక్షనే నిజం అయ్యిందిగా..
- టాక్.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రిలీజ్ ఆ ఏడాదిలో!?
- సినిమా కంటే ముందే పాన్ ఇండియా వైడ్ వైరల్ గా పవన్ పేరు..
- “కల్కి” అప్డేట్ పైనే అందరి కళ్ళు.!
- ఓటిటి: “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రాక అప్పుడే!?