సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలకానున్న మరొక సినిమా !

సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలకానున్న మరొక సినిమా !

Published on Mar 11, 2018 9:52 AM IST

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ మంచి విడుదలను అందించే నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మరొక చిన్న చిత్రాన్ని విడుదలచేయనుంది. ఆ సినిమానే ‘అమీర్ పెట్ టూ అమెరికా’. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. సినిమాలోని కంటెంట్ నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్, ఆషియన్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆంధ్ర, నైజాం ఏరియాల్లో విడుదలచేయనున్నాయి.

నూతన దర్శకులు రామ్మోహన్ కమండూరి, భాను కిరణ్ చల్లాలు సంయుక్తంగా డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాధా మీడియా బ్యానర్ పై కొమండూరి పద్మజ నిర్మించారు. కార్తిక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ చిత్రంలో తేజస్, పల్లవి డోర, వంశీ కృష్ణ, మేఘన, వంశీ కోడూరి, సాషా సింగ్ తదితరులు నటించారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

తాజా వార్తలు