ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారిన అంశం నటి శ్రీ రెడ్డి. తెలుగు పరిశ్రమలో చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెలుగమ్మాయిలంటే చిన్న చూపు చూస్తున్నారని, కాస్టింగ్ కోచ్ తీవ్ర స్థాయిలో ఉందని వాదించిన ఆమె సొషల్ మీడియా ద్వారా పరోక్షంగా దర్శకుడు శేఖర్ కమ్ములను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కొమ్ములు వచ్చిన శేఖరుడు అంటూ సంభోదిస్తూ ఆయనకు తెలుగమ్మాయిలంటే తక్కువ భావన ఉందంటూ విమర్శలు చేశారు. వీటిపై స్పందించిన శేఖర్ కమ్ముల తనపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి తన వాళ్ళ దగ్గర తన విలువని తక్కువ చేయడం భావ్యం కాదని, తనకో వ్యక్తిత్వం, విలువలు ఉన్నాయని, తాను కూడ స్త్రీలకు, వారి పురోగతికి ప్రాముఖ్యత ఇస్తానని, తానేంటో తన గురించి తెలిసిన వాళ్లకు బాగా తెలుసని అన్నారు.
అలాగే తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినవారు క్షమాపణ చెప్పి ప్రతి మాటను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.


