తేజ సినిమాలో తెలుగు హీరోయిన్ నటించడం లేదు !

తేజ సినిమాలో తెలుగు హీరోయిన్ నటించడం లేదు !

Published on Apr 3, 2018 5:36 PM IST


తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోయే సినిమాలో ఇషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వచ్చాయి. చాలా ఇంటర్వ్యూ ల్లో ఇషా తను వెంకటేష్ సినిమాలో నారా రోహిత్ కు జోడిగా నటించబోతున్నానని వెల్లడించింది. తాజా సమాచారం మేరకు ఇషా ఈ పాత్ర చెయ్యట్లేదని తెలుస్తోంది. ఆ పాత్రలు ఆమె కంటే వేరే నటి అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో నటించే ఇతర హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియనుంది. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాకు అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా లక్ష్మి భూపాల మాటలు రాస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా లో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

తాజా వార్తలు