‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !

‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !

Published on Apr 24, 2018 3:52 PM IST

ఈ నెల 20న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల చిత్రం ‘భరత్ అనే నేను’ అందరి ప్రసంశలు అందుకుంటూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని నిన్న ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో మాట్లాడిన దర్శకుడు కొరటాల శివ ఫైనల్ ఎడిటింగ్ సమయంలో కొన్ని మంచి మంచి సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని అన్నారు.

అలాగే ఆ సన్నివేశాలని త్వరలోనే సినిమాకు కలపబోతున్నామని కూడ తెలిపారు. ఇప్పటికే ఈ సన్నివేశాల తాలూకు డబ్బింగ్ కూడ మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశాలు ఎప్పటి నుండి సినిమాలో చేరుతాయో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గతంలో కొరటాల, మహేష్, దానయ్య ముగ్గురు కూడ పలు సందర్భాల్లో రెండు భాగాలుగా తీయగల కంటెంట్ ఉన్న సినిమాను చాలా సన్నివేశాలు తొలగించి 2 గంటల 53 నిమిషాలకు కుదించామని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు