‘సమ్మోహనం’ టీజర్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

‘సమ్మోహనం’ టీజర్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

Published on May 2, 2018 8:47 AM IST

హీరో సుధీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘సమ్మోహనం’.’జెంటిల్మెన్స్, అమీ తుమీ’ వంటి సినిమాలతో వరుస హిట్లందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ నిన్న సాయంత్రం విడుదలై మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది.

ఈ నైపథ్యంలో టీజర్లో హీరోయిన్ అదితిరావ్ హైదరికి నటి నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారనే పుకార్లు బయలుదేరాయి. వీటిపై స్పందించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి కొందరు అదితికి నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. అదితి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి రూమర్స్ రాకుండా ఈ క్లారిటీ ఇస్తున్నాను అన్నారు. ఇకపోతే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూన్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజా వార్తలు