‘సాహో’ యాక్షన్ సన్నివేశాల ఖర్చు రూ. 90 కోట్లు !

‘సాహో’ యాక్షన్ సన్నివేశాల ఖర్చు రూ. 90 కోట్లు !

Published on May 2, 2018 4:54 PM IST

‘బాహుబలి’ తరవాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ టీఆర్ డమ్ దేశవ్యాప్తం కావడంతో ఇతర భాషలు మార్కెట్లలో ఆయన సినిమాలకు క్రేజ్ పెరిగింది. అందుకే నిర్మాతలు మేకింగ్ స్థాయి ఎక్కడా తగ్గకుండా రూ.300 కోట్ల బడ్జెట్ ను సినిమాకు కేటాయించారు.

ఈ రూ.300 కోట్లలో సుమారు రూ.90 కోట్లను ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ షెడ్యూల్ కోసం ఖర్చు పెడుతున్నారట. సుమారు 50 రోజుల ఈ షెడ్యూల్లో ఖరీదైన బైకులు, కార్లు, బస్సులు, 250 మంది క్రూ సభ్యులను, అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఏక్యూప్మెంట్స్ ను వినియోగిస్తున్నారట. ఇకపోతే అబుదాబి ఫిల్మ్ కమీషన్ తమ రూల్స్ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణకు 30 శాతం రాయితీని కూడ ఇస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు