కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే బెటర్ అనుకుంటున్న బన్నీ !

కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే బెటర్ అనుకుంటున్న బన్నీ !

Published on May 15, 2018 8:54 AM IST

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ మొదటి రోజు నుండే యావరేజ్ టాక్ తెచ్చుకుని అలాగే నడుస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో బన్నీ కొంత ప్రయోగం చేశారనే చెప్పాలి. ఈ ప్రయోగంతో బన్నీ నటనకు మంచి పేరైతే వచ్చింది కానీ తుది ఫలితం ఆశించినంతగా అందలేదు. అందుకే అల్లు అర్జున్ ఈసారి ప్రయోగం కాకుండా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నారట.

అందుకే అభిమానులకు, ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్ కలిగి ఉన్న కథ కోసం చూస్తున్నారట. ఇకపోతే బన్నీ నెక్స్ట్ సినిమా విక్రమ్ కుమార్ తో ఉంటుందని, గతంలో బన్నీతో ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాను రూపొందించిన హరీష్ శంకర్ కూడ ఆయన కోసం కొత్త కథను సిద్ధం చేస్తున్నారని రక రకాల వార్తలు వినిపిస్తుండగా దేనిపైనా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

తాజా వార్తలు