
దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజల ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అమెరికాలోని పలు ఖరీదైన లొకేషన్లలో కూడ షూటింగ్ జరిపారు శ్రీను వైట్ల. ఇకపోతే రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ‘వెంకి, దుబాయ్ శ్రీను’ సినిమాల్లో వరుస పంచులతో సాగే కామెడీ. అందుకే ఈ సినిమాలో కూడ అలాంటి కామెడీయే ఉండేలా చూసుకుంటున్నారు శ్రీను వైట్ల.
అందుకోసం స్టార్ కమెడియన్లు శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు వంటి వారిని చిత్రంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారి మీదనే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

