‘బిగ్ బాస్’ 2017లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బుల్లితెర రియాలిటీ షో . హిందీ లో విజయం సాధించిన ఈ షో ని తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారో లేదో అని మొదటి సీజన్ ఆరంభంలో సందేహాలు వ్యక్త మయ్యాయి . కాని ఎన్టీఆర్ వాక్యతగా వచ్చినా బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది . దీని తరువాత ప్రేక్షకుల చూపు బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఫై పడింది.
అయితే ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సెకండ్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీనితో సెకండ్ సీజన్ కి ఎవరు హోస్ట్ చేస్తారో అని ప్రేక్షకులు ఆస్తిగా గమనించసాగారు .ఈ క్రమంలో హోస్ట్ గా రానా , అల్లు అర్జున్ , నాని పేర్లు తెర మీదకు వచ్చాయి. వీటిలో ప్రముఖంగా ‘న్యాచురల్ స్టార్ నాని’ పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. చివరికి నాని నే బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడని అని ‘ స్టార్ మా’ యాజమాన్యం కొద్దీ నిమిషాల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీనీతో హోస్ట్ ఎవరన్న సంగతి తెలిసింది. మరి ఈ సెకండ్ సీజన్ లో పాలుగొనే పార్టిసిపెంట్స్ ఎవరో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.


