కొరటాల తర్వాతి సినిమా చిరుతో ?


ఇటీవలే ‘భరత్ అనే నేను’తో భారీ విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ తన తర్వాతి సినిమాను ఏ స్టార్ హీరోతో చేస్తారో చూడాలని అందరిలోను కుతూహలం నెలకొంది. కానీ కొరటాల శివ మాత్రం ఇంకా నెక్స్ట్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తరవాతి సినిమా హీరో నాగ చైతన్య అని కొందరు, నాని అని ఇంకొందరు అంటూ వచ్చారు.

కానీ ఇప్పుడు కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిరు ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉండటం మూలాన వీరి చిత్రం ఈ ఏడాది ఆఖరులో లేదా 2019 ఆరంభంలో మొదలయ్యే సూచనలున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంత మటుకు వాస్తవముందో తేలాలంటే ప్రస్తుతం హాలీడే ట్రిప్లో ఉన్న కొరటాల తిరిగొచ్చి అధికారిక ప్రకటన చేసే వరకు ఆగాల్సిందే.

Exit mobile version