‘పెళ్లిచూపులు’ అనే చిన్న చిత్రంతో పెద్ద విజయాన్ని సాధించిన యువ దర్శకుడు తరుణ్‌భాస్కర్. ‘పెళ్లి చూపులు’ లాంటి సక్సెస్ వచ్చాక కూడా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తరుణ్, కొత్త నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది ?’ అనే చిత్రాన్ని ప్రకటించి, తన రెండో చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నారు. ‘ఈ నగరానికి ఆదివారం ఒక మంచి ట్రైలర్ వస్తుంది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ట్రైలర్ విడుదల చేస్తునట్టు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. కథ మాటలతో పాటు స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు కూడా తరుణ్ భాస్కరే నిర్వహిస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ చిత్రం లాగే ఈ చిత్రం కూడా అందరూ కొత్తవారితోనే చిన్న చిత్రంగానే తెరకెక్కుతుంది. మరీ ‘పెళ్లిచూపులు’ లాగే ‘ఈ నగరానికి ఏమైంది ?’ కూడా భారీ విజయం సాధిస్తుందేమో చూడాలి.


