నూతన దర్శకుడికి రాజమౌళి ప్రశంస !

నూతన దర్శకుడికి రాజమౌళి ప్రశంస !

Published on Jun 11, 2018 12:23 PM IST

rajamouli11

మంచి లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. టీజర్ తో అందరి దృష్టినీ తనవైపు తిప్పికున్న ఈ చిత్రం తాజాగా ట్రైలర్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండిన ఈ చిత్రంపై ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ చూసి ఆసక్తికరమైన థ్రిల్లర్ అంటూ మెచ్చుకోవడమే కాకుండా దర్శకుడు విజయ్ యలకంటికి శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి చిత్రంగా ఇలాంటి కొత్త తరహా థ్రిల్లర్ ను ఎంచుకోవడం బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణన్, శ్రీకాంత్ అయ్యర్, సామ్రాట్ రెడ్డిలు పలు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం కెనడాలో జరగబోయే ఒట్టావా ఫిల్మ్ ఫెస్టివల్ కు సైతం ఎంపికైంది.

తాజా వార్తలు