ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో ఉన్న 34 అంతస్థుల భవనంలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. ఆ భవంతిలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నివాసం కూడ ఉంది. దీంతో ఒక్కసారిగా అభిమానుల్లో కలకలం మొదలైంది. అగ్ని ప్రమాదంలో ఆమెకు ఏమైనా హాని కలిగిందా అని కంగారుపడి సోషల్ మీడియాలో ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇది గమనించిన దీపికా తాను క్షేమంగానే ఉన్నానని, తన గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని, ప్రమాదం జరిగిన చోట ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్దిద్దాం అన్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై మీడియా కథనం మేరకు ఆమె నివాసం, ఆఫీస్ రెండూ బాగానే ఉన్నాయని తెలుస్తోంది.
I am safe.Thank You everyone.Let us pray for our firefighters who are at site risking their lives…:pray::skin-tone-4:
— Deepika Padukone (@deepikapadukone) June 13, 2018


