‘పవన్ కళ్యాణ్ మాజీ భార్య’కు ‘జీవిత భాగస్వామి’ దొరికాడు !

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్, తనని తన పిల్లలను చూసుకోవడానికి ఓ మనిషి తోడు కావాలని, అందుకే తాను రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు ఆమె ఓ సంద్భరంలో పబ్లిక్ గానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్‌మీడియాలో ఆమెను విమర్శిస్తూ వారు తమ నిరసనను తెలిపారు. రేణూ దేశాయ్ తనని విమర్శించిన పవన్ అభిమాకులందరికీ ధీటుగానే సమాధానం చెప్పారు.

అయితే తాజాగా రేణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ ఫోటోను చూస్తుంటే ఇన్నాళ్ళకు రేణు దేశాయ్ కోరుకున్న జీవిత భాగస్వామి దొరికినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోలో ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకుని ఉన్నారు. ఈ ఫొటోతో పాటుగా నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా అంటూ కవిత కూడా రాసి పోస్ట్ చేశారు. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అని ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అని ఆ వ్యక్తి గురించి రేణుదేశాయ్ రాసుకొచ్చారు.

రేణు దేశాయ్ రాసిన ఈ కవితలను బట్టి ఆలోచిస్తుంటే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తే ఆమెకు కాబోయే భర్తే అని తెలుస్తోంది. కొంతమంది నెటిజన్లు ఇదే విషయాన్ని కామెంట్లు రూపంలో అడుగుతున్నారు. ఇంకొంతమంది ఇన్ని సంవత్సరాలకి మీకు మీ ప్రేమ దొరికింది, సంతోషంగా ఉండండి. అంటూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. రేణు దేశాయ్ మాత్రం ఇంకా ఈ కామెంట్లుకు స్పందించలేదు, అయితే రేణును పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version