తమిళ హీరో కార్తీ , సయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘కడైకుట్టి సింగం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది . ఈనెల 13 న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషలలో ఒకేసారి విడుదలకానుంది.
ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కార్తీ రైతుల సమస్యల ఫై పోరాడే నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. తమిళ్ లో కార్తీ అన్నయ్య హీరో సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.


