‘ఓ నటుడు రాజకీయాల్లో రాణించడం, రాజకీయ నేతగా మారడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. అసలు పార్టీని స్థాపించి దానిని సమర్ధవంతంగా నడిపించాలనుకున్నే లోపు ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తాయి. నిజంగా ఒక నటుడికి రాజకీయాలు అంత సులువైన పని కాదని చెప్పుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం గురించి ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. కమల్, రజనీ ఎలాగూ రాజకీయాల్లోకి వచ్చారు. వారు ఈ దేశ రాజకీయాలకు ఓ కొత్త రూపు కల్పిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నటీనటులు ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి వారు సమస్యలకు త్వరగా స్పందిస్తారు. ఇక మా అన్నయ్య చిరంజీవిగారు కూడా సునామీలా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అన్నయ్యకు లేదు. ఆయన తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


